Chrome లాంటి బ్రౌజర్ను మీరు ఉపయోగించినప్పుడు, అది దాని కాష్లోను, కుక్కీలలోను వెబ్సైట్ల నుండి కొంత సమాచారాన్ని సేవ్ చేస్తుంది. వాటిని క్లియర్ చేయడం వల్ల, సైట్లలో ఎదురయ్యే నిర్దిష్ట సమస్యలు పరిష్కరించబడతాయి, అంటే లోడ్ చేయడం లేదా ఫార్మాట్ చేయడం వంటి వాటిలో ఎదురయ్యేవి.
Chromeలో
- మీ కంప్యూటర్లో, Chromeను తెరవండి.
- ఎగువ కుడి వైపున, మరిన్ని
బ్రౌజింగ్ డేటాను తొలగించండి ఆప్షన్ను క్లిక్ చేయండి.
- చివరి గంట లేదా మొత్తం సమయం వంటి సమయ పరిధిని ఎంచుకోండి.
- మీరు తీసివేయాలనుకుంటున్న సమాచారం రకాలను ఎంచుకోండి.
- డేటాను తొలగించండి ఆప్షన్ను క్లిక్ చేయండి.
- మీరు Chromeకు సైన్ ఇన్ చేసేటప్పుడు కుక్కీలను తొలగిస్తే, మిమ్మల్ని సైన్ ఇన్ చేసి ఉంచే Google కుక్కీలను Chrome రిఫ్రెష్ చేస్తుంది. మీరు ఆశించిన విధంగా Chrome పని చేస్తూ ఉండేలా చేయడానికి ఇలా జరుగుతుంది. Google కుక్కీలను తొలగించడానికి, ముందుగా Chrome నుండి సైన్ అవుట్ చేయండి.
చిట్కాలు:
- అన్ని వెబ్సైట్లలో మీ Google ఖాతా నుండి సైన్ అవుట్ చేయడానికి, Chrome నుండి సైన్ అవుట్ చేయండి.
-
'బ్రౌజింగ్ డేటాను తొలగించండి' డైలాగ్ను త్వరగా యాక్సెస్ చేయడానికి, అడ్రస్ బార్లో, “బ్రౌజింగ్ డేటాను క్లియర్ చేయండి” అని టైప్ చేసి, ఆపై యాక్షన్ చిప్ అనే ఆప్షన్ను ట్యాప్ చేయండి. టాస్క్లను త్వరగా పూర్తి చేయడానికి Chrome చర్యల గురించి తెలుసుకోండి.
Chromeలో మరిన్ని కుక్కీ సెట్టింగ్లను ఎలా మార్చాలో తెలుసుకోండి. ఉదాహరణకు, మీరు నిర్దిష్ట సైట్ కోసం కుక్కీలను తొలగించవచ్చు.
ఇతర బ్రౌజర్లలో
ఒకవేళ మీరు Safari, Firefox, లేదా మరొక బ్రౌజర్ను ఉపయోగిస్తున్నట్లయితే, సూచనల కోసం దాని సపోర్ట్ సైట్ను చెక్ చేయండి.
మీరు ఈ సమాచారాన్ని క్లియర్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది
మీరు కాష్ను, కుక్కీలను క్లియర్ చేసిన తర్వాత:
- సైట్లలోని కొన్ని సెట్టింగ్లు తొలగించబడతాయి. ఉదాహరణకు, మీరు సైన్ ఇన్ చేసి ఉన్నట్లయితే, మీరు మళ్లీ సైన్ ఇన్ చేయాల్సి ఉంటుంది.
- ఒకవేళ మీరు Chromeలో సింక్ను ఆన్ చేసినట్లయితే, మీ పరికరాలన్నిటిలో మీ డేటాను తొలగించడం కోసం మీరు సింక్ చేస్తున్న Google ఖాతాకు సైన్ ఇన్ చేయబడే ఉంటారు.
- కొన్ని సైట్లు మరింత నెమ్మదిగా ఉన్నట్లు అనిపించవచ్చు, ఎందుకంటే ఇమేజ్ల లాంటి కంటెంట్ మళ్లీ లోడ్ కావలసి ఉంటుంది.
కాష్ & కుక్కీలు ఎలా పని చేస్తాయి
- మీరు సందర్శించే సైట్ల ద్వారా రూపొందించబడిన ఫైల్లను కుక్కీలు అంటారు. అవి బ్రౌజింగ్ డేటాను సేవ్ చేయడం ద్వారా మీ ఆన్లైన్ అనుభవాన్ని మరింత సులభం చేస్తాయి.
- మీ తర్వాతి సందర్శన సమయంలో పేజీలను వేగంగా తెరవడంలో సహాయపడటానికి, ఇమేజ్ల లాంటి పేజీలలోని భాగాలను కాష్ గుర్తుంచుకుంటుంది.